Venkatesh1

Apr 24 2024, 07:45

జగనన్న చెప్పాడంటే..అమలు చేస్తాడంతే.. జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

జగనన్న చెప్పాడంటే..అమలు చేస్తాడంతే.. జగనన్నను సీఎం చేసుకుంటే మరింత సంక్షేమం.. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ టీడీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు గల్లంతు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పాడంటే తప్పని సరిగా అమలు చేస్తాడని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం జంబులదిన్నె, జంబులదిన్నె కొట్టాల, తలగాసిపల్లి, గార్లదిన్నె గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి, ఎం. శంకర్ నారాయణ, జిల్లా అధ్యక్షులు పైలా నరసింహయ్య, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డిలతో కలసి వీరాంజనేయులు నిర్వహించారు.

పార్టీ శ్రేణులు శాలువాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

వారు మాట్లాడుతూ..జగనన్న పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. చంద్రబాబు గతంలో 600 హామీలు 

 ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ విషయం ప్రజలు ఎప్పటికీ మరువరన్నారు.ఇప్పుడు 6 హామీలతో ప్రజల్లోకి వస్తున్న చంద్రబాబుకు 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని చెప్పారు.

నియోజకవర్గంలోని టిడిపి వాళ్ళు పగటి కలలు కంటూ వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారన్నారు. ప్రజలకు ఏం చేయలేని టిడిపి ఓట్ల కోసం నానా తంటాలుపడుతూ అబద్ధపు హామీలతో ప్రజల్లోకి వస్తుంటే ప్రజలు నిలదీస్తున్నారన్నారు. జగనన్న ప్రభుత్వంలో అర్హులైన అన్ని పార్టీల వారికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. అబద్ధపు హామీలతో వస్తున్న చంద్రబాబు కావాలా మాట నిలబెట్టుకున్న జగనన్న కావాలా అని ప్రజలు బేరీజు చేసుకోవాలన్నారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులమైన తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 23 2024, 08:01

బుక్కరాయసముద్రం మండలంలో పలు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహ కార్యదర్శి కట్టప్ప గారి రామలింగారెడ్డి..

శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం  గాంధీ నగర్ లోని సాకే బలప్ప కుమారుడు నాగేంద్ర వివాహ కార్యక్రమంకు ₹5000/- రూపాయలు ఆర్థికసాయం మరియు చెన్నంపల్లి గ్రామంలో కొద్దిరోజులు కిందట కాలువిరిగిన నారాయణమ్మ గారి వైద్యఖర్చుల నిమ్మితం ₹5000/-రూపాయలు ఆర్థికసాయం చేసినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున రెడ్డి, సర్పంచ్ మల్లికార్జున, పెద్దన్న, యాగంటి, యస్వంత్, అంజి, రామాంజి ,తలారి నాగేంద్ర,చెన్నమయ్య, బండారు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 23 2024, 07:46

నేను మీలో ఒకడిని..ఆశీర్వదించండి.. నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత.. జగనన్నను మళ్ళీ సీఎం చేసుకుందాం.. ఎం. వీరాంజనేయులు..

నేను మీలో ఒకడిని..ఆశీర్వదించండి.. నియోజకవర్గ అభివృద్ధి నా బాధ్యత.. జగనన్నను మళ్ళీ సీఎం చేసుకుందాం.. ఎం. వీరాంజనేయులు

◆ ప్రజలను మభ్య పెట్టేందుకే టీడీపీ కూటమి

'నేను మీలో ఒకడిని.. ఆశీర్వదించండి.. శింగనమల నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా' అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

బుక్కరాయసముద్రం మండలం ఓబుళాపురం, దండువారిపల్లి, ఏడావులపర్తి, దయ్యాలకుంటపల్లి, వెంకటాపురం గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి ఆయన చేపట్టారు.

గ్రామస్తులు, నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనస్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ.. అవ్వాతాతలను,ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని వారికి వివరిస్తూ, సంక్షేమ పథకాలు ఇలానే కొనసాగాలంటే "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి గెలిపించాలను విజ్ఞప్తి చేశారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుంటే, చంద్రబాబు నాయుడు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టి కూటమితో జతకట్టి వస్తున్నారని వారిని నమ్మి మోసపోకండి అన్నారు. జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటేనే సంక్షేమం, అభివృద్ధి పూర్తి స్థాయిలో కొనసాగుతాయన్నారు. తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో టిడిపి వాళ్లు మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని వారిని వారి సొంత పార్టీ వారే నమ్మే పరిస్థితుల్లో లేనప్పుడు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఎద్దేవా చేశారు. ప్రజలు కష్ట కాలంలో ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో లేని అభ్యర్థి, ఓట్ల కోసం మీ ముందుకు వస్తున్నారనే విషయాన్ని గమనించాలని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను, ఎంపీ అభ్యర్థి అయిన శంకర్ నారాయణ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 22 2024, 07:36

శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి కు బి-ఫామ్ అందజేసిన టిడిపి అధినేత చంద్రబాబు

శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి కు బి-ఫామ్ అందజేసిన టిడిపి అధినేత చంద్రబాబు

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో బీఫామ్ అందుకున్న. శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి

పార్లమెంట్ అభ్యర్థి అంబికాతో పాటు మిగిలిన అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి బీఫామ్ అందుకున్న శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి

విజయంతో తిరిగి రావాలని చంద్రబాబు సూచన

* శింగనమల  స్థానాన్ని గెలిచి బహుమతిగా ఇస్తానన్న శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి

Venkatesh1

Apr 22 2024, 07:27

బుక్కరాయసముద్రం మండలంలో మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాకే శైలజనాథ్ విస్తృత ప్రచారం

బుక్కరాయసముద్రం మండలం 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా సంజీవపురం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భీమిరెడ్డి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో100 కుటుంబాలు డాక్టర్ సాకే శైలజనాథ్ సమక్షంలో చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు బండ్లపల్లి ప్రతాపరెడ్డి జిల్లా ఓబీసీ అధ్యక్షుడు రామ్ చరణ్ యాదవ్ బుక్కరాయసముద్రం కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మారిసెట్టి సురేష్ నార్పల కన్వీనర్ రామాంజనేయులు ఎస్సీ సెల్ నాయకుడు అంజి సింగనమల యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు భీమ్ రెడ్డి పెద్దిరెడ్డి R మునిరెడ్డి నాయకుడు మారుతి మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరియు సంజీవపురం గ్రామస్తులు

Venkatesh1

Apr 22 2024, 07:16

చరిత్రలో నిలిచిపోయేలా జగనన్న పాలన.. సంక్షేమ పాలన కొనసాగలంటే.."ఫ్యాన్"కు ఓటు వేయాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

చరిత్రలో నిలిచిపోయేలా జగనన్న పాలన.. సంక్షేమ పాలన కొనసాగలంటే.."ఫ్యాన్"కు ఓటు వేయాలి.. ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

◆ టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు

దేశ చరిత్రలో ఎవరికీ సాధ్యంకాని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అందించారని, ప్రజలు ఓట్లు వేసి పట్టం కట్టాలని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

పుట్లూరు మండలం శనగలగూడూరు, తక్కళ్లపల్లి, పోతిరెడ్డిపల్లి, గాండ్లపాడు, ఎస్.తిమ్మాపురం, కొండేపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా వైయస్సార్ గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులతో కలసి వీరాంజనేయులు చేపట్టారు.

గ్రామాల్లోని ప్రజలు, పార్టీ శ్రేణులు శాలువాలతో సత్కరించి, పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. మహిళలను, వృద్ధులను పలకరిస్తూ, జగనన్న పాలన ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలతో, పింఛన్లులతో సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఇంటింటికీ వెళ్లి "ఫ్యాన్"గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తూ కరపత్రాలు అందజేశారు.

వీరాంజనేయులు మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ఊసే లేకుండా ప్రజలను అన్ని విధాలా మోసం చేసారని తెలియజేశారు. జగనన్న పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. నేరుగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేక చంద్రబాబు నాయుడు వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. గెలుపు కోసం ఆయన ఇలా ఎన్ని పార్టీలతో కలసి వచ్చిన ఫలితం శూన్యం అన్నారు. జగనన్న ఐదేళ్లలో అందించిన ప్రజారంజక పాలనను చూసిన టీడీపీ, జనసేన,బీజేపీ ఓటమి భయంతో పొత్తులతో వస్తున్నారన్నారు. అధికారం కోసం కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న బాబుకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 21 2024, 07:57

చంద్రబాబునాయుడు గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి పుష్పగుచ్చం అందజేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు,ద్విసభ్య కమిటి సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు

Venkatesh1

Apr 21 2024, 07:49

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తా : టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ

శింగనమల  నియోజకవర్గం శింగనమల మండలం గుమ్మేపల్లి గ్రామం..

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా పని చేస్తా : టిడిపి జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ

గుమ్మేపల్లి గ్రామం ఎన్నికల పర్యటనలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు గుమ్మేపల్లి గ్రామంలో ప్రజల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషకర విషయమని బండారు శ్రావణి శ్రీ గారు తెలియజేశారు. 

   ఈ సందర్భంగా గుమ్మేపల్లి గ్రామంలో ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి  బండారు శ్రావణి శ్రీ గారు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా తన వంతు కృషి చేస్తానని గ్రామ అభివృద్ధికి తోడ్పడుతానని వచ్చే ఎన్నికల్లో అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్యకర్తలను నాయకులను మరియు గ్రామస్తులను కోరడం జరిగింది.

 అనంతరం జనసేన పార్టీ శింగనమల మండల అధ్యక్షుడు తోట ఓబులేసు గారి స్వగృహానికి విచ్చేసిన బండారు శ్రావణశ్రీ గారికి గజమాలతో ఆహ్వానం పలికారు.

 ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి మండల నాయకులు కార్యకర్తలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు.

Venkatesh1

Apr 21 2024, 07:38

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు "పల్లె నిద్ర"

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు "పల్లె నిద్ర"

గ్రామాల్లో ప్రజల కష్టాలను ప్రజా సమస్యలను ప్రత్యక్ష పరిశీలించి పరిష్కరించటం కోసమే పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు తెలిపారు.

గ్రామాల్లో పల్లె నిద్ర చేయడం చాలా సంతోషకరంగా ఉందని, అలాగే రైతుల, ప్రజల సమస్యలు తెలుసుకున్నానని, సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారం అనంతరం శింగనమల మండలం సోదనపల్లి గ్రామంలో "పల్లె నిద్ర" కార్యక్రమాన్ని  వీరాంజనేయులు నిర్వహించారు.

స్థానికులతో కలసి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించి, జరిగిన లబ్ధిని వారిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కాలనీలో బస చేశారు.

Venkatesh1

Apr 21 2024, 07:31

గ్రామాలే తరిలి వస్తున్నాయి టిప్పర్ డ్రైవర్ కు ఎన్నికల ప్రచారంలో

జన హృదయాల్లో జగనన్నకు సుస్థిర స్థానం

రోజురోజుకూ పెరుగుతున్న ప్రజాదరణ

ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ

టిడిపి మాయమాటలు నమ్మవద్దు

వైఎస్సార్సీపీ తోనే సంక్షేమాభివృద్ధి.

అందరికీ మంచి చేసే జగనన్నకు ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ అన్నారు.

శింగనమల మండలం చిన్నమట్లగొంది, పెద్ద మట్లగొంది, ఈస్ట్.నరసాపురం, సోదనపల్లి గ్రామాలలో "మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైయస్సార్ ఎన్నిక ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డిలతో కలసి వీరాంజనేయులు, శంకర్ నారాయణ చేపట్టారు.

ఆయా గ్రామాల ప్రజలు, పార్టీ శ్రేణులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అడుగడుగునా ఘనంగా స్వాగతం పలికారు. ఇంటింటికీ వెళ్లి జగనన్న చేసిన మంచిని వివరించారు. రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

వారు మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి చరిత్రలో నిలిచిపోయేలా పాలన అందించారన్నారు. అటువంటి గొప్ప పాలనలో తాము కూడా భాగస్వామ్యం అయినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. వైఎస్ఆర్సిపి తోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యమన్నారు. టిడిపి ఐదేళ్ల పాలనలో పేదలకు సంక్షేమాన్ని దూరం చేసిందన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో విధ్వంస పాలన సాగించారన్నారు. కూటమి పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ మోసాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం గా చేస్తే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులమైన తమను "ఫ్యాన్" గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.